15 April, 2026 | 3:16 AM

ప్రభుత్వ కళాశాల టాపర్లకు సన్మానం

15-04-2026 12:00 AM

ఇంటర్ విద్య కార్యాలయంలో అభినందన సత్కారం

హనుమకొండ, ఏప్రిల్ 14(విజయ క్రాంతి): ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యున్నత మార్కులు పొందిన విద్యార్థులను వరంగల్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అభినందించారు.  ఇంటర్ విద్య కార్యాలయంలో జిల్లా స్థాయిలో అన్ని గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లి దండ్రులను శాలువా, మెమెంటోతో సత్కరించారు.

ఎంపీసీ గ్రూపులో 989 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ఖానాపురం జూనియర్ కళాశాల విద్యార్థి యశ్వంత్ ను, తల్లిదండ్రులను అభినందించారు.  గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కార్పోరేట్ స్థాయి మార్కులు సాధించడం ప్రశంసనీయమని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులకు గర్వకారణమని అన్నారు.

రాబోయే విద్యా సంవత్సరంలో  ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల కొరకు వెల్ కం కిట్, మధ్యాహ్న భోజనం, అల్పాహారం సైతం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు సంపత్ కుమార్, శరదృతి తదితరులు పాల్గొన్నారు. 

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల టాపర్లు వీరే..

ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్  కళాశాల విద్యార్థి యశ్వంత్ 989/1000, రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి అల్ఫియా ఆనం 978/1000,  అదేవిధంగా క్రిష్ణా కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల కు చెందిన విద్యార్థినిలు జి. పల్లవి 970/1000, సానియా 968/1000నందిని 960/1000 మార్కులు సాధించారు.