16 March, 2026 | 4:06 AM

భవిష్యత్తులోనూ మనదే ఆధిపత్యం

16-03-2026 12:29 AM
  1. ఐసీసీ టోర్నీల్లో భారత్ జోరుపై రోహిత్ 
  2. కుర్రాళ్లు అవకాశాలు వదులుకోవద్దని సూచన
  3. ముంబై టీ20 లీగ్ ట్రోఫీలు ఆవిష్కరణ

ముంబై, మార్చి 15: ఐసీసీ టోర్నమెంట్ల లో భారత జట్ల ఆధిపత్యం చూస్తుంటే సం తోషంగా ఉందని స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. పురుషుల జట్లు, మహిళల జట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొడు తున్నాయని కితాబిచ్చాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించిన టీ ట్వంటీ లీగ్ ట్రోఫీలను రోహిత్ ఆవిష్కరించాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్‌యాదవ్ నాయకత్వం లో వరుసగా రెండు టీ20 వరల్ కప్‌లను కైవసం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో తొలిసారి మహిళా వన్డే ప్రపంచ క ప్‌ను దక్కించుకుంది. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఆధిపత్యానికి ఇది ఆరంభం మాత్ర మేనని..

ముందు ముందూ ఇది మరింతగా కొనసాగుతుందని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. టీమిండియా కొంతకాలంగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉందని రోహిత్ శర్మ తెలిపారు. కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగు తోందని, భవిష్యత్తులో కూడా ఇదే దూకుడు కొనసాగుతుందని చెప్పాడు. పురుషుల జట్టు వరుస గా రెండు టీ20 వరల్ కప్‌లను గెలవడం గర్వంగా ఉందన్నాడు. అయితే, ఉమెన్స్ జ ట్టుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్టు రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ విజయాలతో అందరిపై బాధ్యత మరింత పెరుగుతుందని వెల్లడించాడు.

ఎప్పుడు ఛాన్స్ వచ్చి నా.. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కుర్రాళ్లు సిద్ధంగా ఉండాలని సూచించాడు. ప్రతి సవాల్‌ను స్వీకరిస్తూ.. అందుకోసం సన్నద్ధం కావడమే కీలకమన్నాడు. జాతీయ జట్టుకు ఎవరినైనా ఎంపిక చేశారంటే దానికికారణం ఉంటుందని, భారత్‌లో చాలా పోటీ ఉంటుందని, అండర్- 14 నుంచే ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించాడు. అద్భుతమైన టాలెంట్ ఉన్నా సరే కాస్త అదృష్టం కలిసిరావాల్సిందేనని చెప్పా డు. సరైన సమయంలో మనలోని ప్లేయర్‌ను గుర్తించే వ్యక్తి తారసపడాలన్నాడు.