డేగ బాబు, డేగ కొండయ్యకు సన్మానం
కోదాడ,(అనంతగిరి): కోదాడ పట్టణంలోనీ డేగ బాబు నివాసంలో మంగళవారం అనంతగిరి గ్రామ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ డేగ కొండయ్య, కొండపల్లి వాసు, ధర్మ సమాజ్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేసి గెలిచిన నకిరికంటి వీరబద్రమ్మ యల్లయ్య మంగళవారం డేగ బాబు-లక్ష్మి, డేగ కొండయ్య-అరుణకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డేగబాబు, కొండయ్య అనంతగిరి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించి 350 ఓట్ల మెజార్టీ గెలుపు అందించారు.
వారి సేవకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో డేగ కొండయ్య , కొండపల్లి వాసు సూచనల మేరకు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తపల్లి శ్రీను, కొత్తపల్లి భిక్షం, నకిరికంటి సురేష్ నకిరికంటి నారాయణ గణేష్, మైసయ్య పాల్గొన్నారు.






