9 April, 2026 | 5:21 PM

Breaking News

ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •  

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

16-02-2026 06:48 PM

నూతన కౌన్సిలర్ల సన్మాన సమావేశంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీశైలం రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్

తాండూరు,(విజయక్రాంతి): నిత్యం ప్రజల మధ్య ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బిఆర్ఎస్ మున్సిపల్ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. సోమవారం తాండూరులోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  నివాసంలో  నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా వర్గం కూడా సంతోషంగా లేరని ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు నిలదీయాలని అన్నారు . అంతకుముందు నూతన కౌన్సిలర్లు నాగలక్ష్మి అనంత్ రెడ్డి, బి అనిల్ కుమార్, ఎండి ఇర్షాద్, ఎండి జావిద్, పట్లోళ్ల దీప నర్సింలు, సురేష్ నాయక్, నవీన , నసీరాబాను, అవుసుల యోగానంద్, మహేశ్వరి, సుప్రీత  పాటిల్, రూప  పాటిల్ లను ఘనంగా సన్మానించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, ప్రమోదిని దేవి, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్,  ఇర్ఫాన్, ఆసిఫ్, వరాల శ్రీనివాస్ రెడ్డి, శోభా రాణి, పరిమళ, బొంబిన,  వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, పర్వత్ పల్లి సర్పంచ్ పాండురంగా రెడ్డి, మారేపల్లి వెంకట రెడ్డి, సిద్రలా శ్రీనివాస్, సంతోష్ గౌడ్, భీమ్ సింగ్, రజాక్, కరుణాకర్ పాటిల్, రుద్రు పాటిల్, వేణు గౌడ్, టిప్పు తదితరులు  పాల్గొన్నారు.