9 April, 2026 | 7:14 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

16-02-2026 06:51 PM

ముత్తారం,(విజయక్రాంతి): జిల్లా యాదవ సంఘం, యాదవ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ముత్తారం మండల కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను మండలంలోని యాదవ సంఘం నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ ముత్తారం మండల అధ్యక్షులు కాసు తిరుపతి యాదవ్, మండల యువత అధ్యక్షులు చెల్కల యుగేందర్ యాదవ్, యాదవ సంఘం నాయకులు పాల్గొని క్యాలెండర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యాదవ సంఘం ఐక్యత,సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణ లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని, విద్య,ఉపాధి సేవా కార్యక్రమాల్లో పురోగతికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు మారేడుగొండ రాజన్న, బక్కతట్ల కుమార్, మండల ప్రధాన కార్యదర్శి, కేషనపల్లి ఉపసర్పంచ్ సింగనవేన సదయ్య, యాదవ సంఘం నాయకులు బక్కతట్ల కుమార్, నూనేటి కృష్ణ,తాత పొచమళ్ళు, రవికుమార్, మారేడుగొండ సమ్మయ్య, టి.తిరుపతి, పెద్ద రాజమల్లు, కిరణ్, రాజశేఖర్, దేవేందర్ లు పాల్గొన్నారు.