27 March, 2026 | 1:44 AM

భారత్‌కు హోర్ముజ్ స్వాగతం

27-03-2026 12:00 AM
  1. జలసంధి వద్ద మరో నాలుగు దేశాలకు అనుమతి
  2. మా స్నేహపూర్వక దేశాల నౌకలను నిలిపివేయబోమన్న ఇరాన్
  3. అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల నౌకలకు నో ఎంట్రీ
  4. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి

టెహ్రాన్, మార్చి 26: మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న ఘర్షణల నేపథ్యంలో, హో ర్ముజ్ జలసంధిలో భారత్‌తోపాటు ఐదు స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలను దిగ్బంధించబోమని ఇరాన్ ప్రకటించింది. ఘర్షణలతో అట్టుడికిపోతున్న ఈ కీలక ప్రదేశం గుండా భారత్‌తో పాటు రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్‌కు చెందిన నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతి లభించింది.

ఇరాన్ ప్రభుత్వ టీవీకి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి గురువారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడు తూ, అనేక స్నేహపూర్వక దేశాలను హోర్ము జ్ వద్ద అనుమతిస్తున్నందున జలసంధి పూర్తిగా మూసివేయలేదని తెలిపారు. చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్, భారతదేశం. కొన్ని రోజుల క్రితం నుంచి నౌకలు, ఇంకా కొన్ని ఇతర దేశాలు, బంగ్లాదేశ్‌కు కూడా ప్రయాణించాయని తెలిపారు.

ఇవి తమతో మాట్లాడి, సమన్వయం చేసుకున్న దేశాలని, యుద్ధం ముగిసిన తర్వాత కూడా భవిష్యత్‌లో ఈ స్నే హం కొనసాగుతుందని తెలిపా రు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న మధ్యప్రాచ్య సంఘర్షణలో పాత్ర పోషిస్తున్న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల నౌకలకు ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాల యం కూడా ‘ఎక్స్’లో వెల్లడించింది.

‘మేము హోర్ముజ్ నుంచి ప్రయాణించేందుకు మిత్ర దేశాలకు అనుమతులు ఇస్తున్నాం. వీటిలో చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్థాన్ ఉన్నాయి’ అని అరాగ్చి ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో హోర్ముజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలు సరకులతో తమ గమ్యస్థానాలు చేరేందుకు మార్గం సులువైంది.

ఇప్పటికే ఐదు గ్యాస్ ట్యాంకర్లు హోర్ముజ్ వద్ద అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ నిర్ణయంతో వీటి ప్రయాణంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని నౌకలు కూడా భారత్‌లోని గమ్యస్థానాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.