25 July, 2026 | 1:47 AM

హిమాచల్‌లో ఘోర ప్రమాదం

25-07-2026 12:00 AM

కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి

సిమ్లా, జూలై 24: హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. లాహౌల్ స్పితి జిల్లా కడు నల్లా సమీపంలో ఉదయ్‌పూర్ కిల్లార్ నుంచి కిలాద్ రహదారిలో ప్రయాణిస్తున్న ఓ టాక్సీ పై పంగీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరు నెలల పసికందుతో సహా 13 మంది మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం నుజ్జునుజ్జయి మంట లు చెలరేగాయి. మృతులంతా చంబా జిల్లా కు చెందినవారిగా అధికారులు గుర్తించారు.

గురువారం రాత్రి ఈ రహదారిని అధికారులు మూసివేయగా కొందరు ప్రయాణికు లు సమీపంలోని టిండి గ్రామం లో బస చేశారు. శుక్రవారం ఉదయం రహదారిని తెరవగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, పరిపాలన యంత్రాంగం, విపత్తు ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.