14-01-2026 11:24:20 AM
ప్రమాదంలో తల్లి, కూతురు మృతి
భూత్పూర్: మండల పరిధిలోని గాజులపేట ( టర్న్ ) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందారు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన సూర్యం తిరుపతి, తన భార్య నాగమణి తో పాటు ఇద్దరు కూతుర్లతో సంక్రాంతి పండుగకు బైక్ ( టి జి 08 ఏజే 1667 ) పై తన గ్రామానికి వెళ్తుండగా భూత్పూర్ మండల పరిధిలోని గాజులపేట సమీపంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి సేఫ్టీ గ్రిల్స్ కు గుద్దగా అక్కడికక్కడే నాగమణి (25) తల పగిలి మృతి చెందింది. యసన్ని (4 )కు త్రివ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్. తిరుపతయ్య, పెద్ద కూతురు ప్రియాంచి లకు గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.