14-01-2026 11:22:27 AM
కల్వకుర్తి: విధుల్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ బైకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం అర్ధరాత్రి ఉరుకొండ మండలం మాదారంలో చోటు చేసుకుంది. చారగొండ మండలం తుర్కలపల్లికి చెందిన మహేష్ అనే ఆపరేటర్ రోజువారీ గా మంగళవారం విధులు నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు త్రీఫేస్ విద్యుత్తు సరఫరాను ప్రారంభించి నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున తన గది పక్కనే ఉన్న బైకు పూర్తిగా కాలిపోయి కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతోనే బైకు దగ్ధమైనట్లు మహేష్ తెలిపారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.