1 July, 2026 | 6:20 PM

Breaking News

సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •   ఇల్లందు టీడీపీ కార్యకర్తను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు   •   మెరుగైన వైద్యం అందించాలి   •   ధర్మారంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ   •   గ్రామ సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం   •  

అలాంటి అవకాశం అందరికీ రాదు

31-07-2024 12:05 AM

టెలివిజన్ నుంచి వెండితెరకు మారిన కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్. అదే స్పీడుతో బాలీవుడ్ వైపు దృష్టి సారించి అక్కడి వారితో కలిసి పనిచేసే అవకాశాలనూ చేజిక్కించుకోగలిగింది. బాలీవుడ్ ప్రముఖులైన మహేశ్ భట్, విక్రమ్ భట్‌లతో కలిసి ఏకంగా రెండు సినిమాలు చేసేసింది. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన తాజాచిత్రం ‘బ్లడీ ఇష్క్’ ఇటీవల నేరుగా ఓటీటీ వేదిక ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మూవీ టీమ్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా ఆ దర్శక, రచయితల గురించి ప్రత్యేకంగా మాట్లాడింది.

“మహేశ్, విక్రమ్ సర్‌లతో కలిసి పనిచేసే అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నా. సెట్స్‌లో వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. వారిద్దరూ నాకు స్ఫూర్తి. ‘బ్లడీ ఇష్క్’ కథే నన్ను ఎంపిక చేసుకుందని భావిస్తున్నా. నచ్చిన డైరెక్టర్‌తో కలిసి ఒక్క ప్రాజెక్టు కోసమైనా పని చేయాలని కలలు కనే చాలా మందిలో నేనూ ఉంటా. విక్రమ్ భట్ దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నటిస్తానని, వాటికి మహేశ్ భట్ కథ అందిస్తారని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి అవకాశం అందరికీ రాదు.. నాకు వచ్చినందుకు ఆనందంగా ఉంది” అని పేర్కొంది. అవికా తెలుగులో ప్రస్తుతం ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘షణ్ముఖ’లో నటిస్తోంది.