calender_icon.png 7 June, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైయారా బలమైన ప్రేమకథ

31-05-2025 12:00:00 AM

యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సైయారా’. ఈ చిత్రంతోనే అహాన్ పాండే హిందీ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేయనుంది వైఆర్‌ఎఫ్ సంస్థ. అనీత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంటెన్స్ లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ చిత్రానికి అక్షయ్ విధాని నిర్మాత.

తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇక టీజర్‌ను గమనిస్తే.. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ ప్రేమకథను అంతే అందంగా తెరకెక్కించారు. హీరోహీరోయిన్ల పరిచయం, ప్రేమ, బ్రేకప్ వంటి సీన్లతో టీజర్‌ను అందంగా మలిచారు. ఈ సినిమా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.