హాస్టల్ తనిఖీ
02-12-2024 12:25 AM
భీమదేవరపల్లి, డిసెంబరు 1 (విజయక్రాంతి): బాలసముద్రంలోని కస్తూర్బాగాంధీ ఆశ్రమ వసతి గృహాన్ని హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య ఆదివారం తనిఖీ చేశారు. వివిధ వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. భోజనశాల, శానిటరీ, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మెడికల్ క్యాం పులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పహారం చేశారు. కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి శ్రీలత, గిరిజన సంక్షేమ అధి కారి ప్రేమలత, వసతి గృహాల సం క్షేమ అధికారి కృష్ణ, హాస్టల్ వార్డెన్ జయలక్ష్మి ఉన్నారు.




