30-10-2025 10:44:29 AM
త్రుటిలో తప్పిన ప్రమాదం
వలిగొండ, అక్టోబర్ 30 (విజయక్రాంతి): "మొంథా" తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షంతో వలిగొండ మండలంలోని రెడ్ల రేపాక గ్రామంలో వృద్ధురాలు బొడ్డు రాములమ్మ నివాసం ఉంటున్న పెంకుటిల్లు కుప్పకూలింది. తుఫాను ప్రభావంతో పెంకుటిల్లు మట్టి గోడలు తడిసి కూలుతుండడాన్ని గమనించిన రాములమ్మ బయటకు రాగానే ఇల్లు కుప్పకూలింది. దీంతో రాములమ్మకు పెను ప్రమాదం తప్పింది. బాధితురాలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ మాద లావణ్య శంకర్ గౌడ్ కోరారు.