calender_icon.png 20 December, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు సేవ, దేశభక్తి అలవర్చుకోవాలి

20-12-2025 12:00:00 AM

ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి

గజ్వేల్, డిసెంబర్ 19: విద్యార్థి దశ నుం డే ఆరోగ్యంగా ఉండడంతోపాటు సమాజ సేవ, దేశభక్తిని అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశా లలో ఉమ్మడి మెదక్ జిల్లా స్పోరట్స్ మీట్ ను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, జిల్లా కాం గ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధారాణిలతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపా టు ఆరోగ్యం, సమాజ సేవ, దేశభక్తి వంటి విలువలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని సూచించారు. మంచి అలవాట్లతో ఎ దిగి, తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థిపై సుమారు రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య ను అందిస్తున్నట్లు తెలిపారు.

విద్యతోపాటు వైద్యానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వై ద్య సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. అదే వి ధంగా గురుకుల పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఈ క్రీడా పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మతిన్, మాజీ కౌన్సిలర్ మ హమ్మద్ సమీర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, నక్క రాములు గౌడ్, విద్యార్థులువిద్యార్థులు నాయకులు, నాయకులు పాల్గొన్నారు.