27 July, 2026 | 12:27 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

వర్షానికి కూలిన ఇండ్లు

05-06-2026 03:37 PM

బాధితులకు సర్పంచ్ ఆర్థిక సాయం

సిరికొండ, జూన్ 5 (విజయ క్రాంతి): మండల పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు సాత్మోరి గ్రామంలో పలు ఇళ్లకు నష్టం వాటిల్లింది. కొందరి ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోగా, మరికొన్ని ఇళ్ల గోడలు కూలిపోయాయి. గ్రామానికి చెందిన కోట్నక్ జంగుబాయి-సోనేరావు దంపతుల ఇంటి గోడలు పూర్తిగా కూలిపోవడంతో ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యం, నిత్యావసర సరుకులు, ఇతర తినుబండారాలు వర్షపు నీటిలో తడిసి పాడయ్యాయి. మనుబోతుల ఎంకవ్వ, గంపల భూమక్క కుటుంబాల ఇళ్లకూ నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న లచ్చింపూర్ సర్పంచ్ కుంరం దీపక్ బాధిత కుటుంబాలను పరామర్శించి నష్టాన్ని పరిశీలించారు. తక్షణ సహాయంగా మనుబోతుల ఎంకవ్వ, గంపల భూమక్క కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలను ఆదుకుని తగిన పరిహారం అందించాలని ఆయన కోరారు.