17 March, 2026 | 2:47 AM

చినుర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

17-03-2026 01:39 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 16 (విజయ క్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా మండలంలోని చినుర్ గ్రామంలో గల లబ్ధిదారులు చిన్నబోయిన సుజాతకు  నూతన ఇందిరమ్మ ఇల్లు మంజురై ఇందిరమ్మ ఇల్లు పూర్తయినందున సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నూతన గృహప్రవేశం నిర్వహించడం జరిగింది.

ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన ఇందిరమ్మ ఇల్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ..గత ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొన్నామని, రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిరుపేదలను గుర్తించి ఎన్నో ఏళ్ల నూతన ఇండ్లు నిర్మించుకోవాలనే కలను నిజం చేశారని అన్నారు. ఈ సందర్భంగా నిరుపేద ప్రజలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల పోరం అధ్యక్షులు మురళి గౌడ్, ఎంపీఓ ప్రభాకర్ చారి, కార్యదర్శి సరేందర్, మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, నాయకులు గంపల వెంకన్న, దివిటి కిష్టయ్య, శ్రీరామ్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.