జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహిణి అదృశ్యం
పిఎస్ లో ఫిర్యాదు చేసిన భర్త
జవహర్ నగర్,(విజయక్రాంతి): గృహిణి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత గబ్బిలాల పేటలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం పాత గబ్బిలాల పేట అంబేద్కర్ నగర్ కు చెందిన బొత్తుల శ్రీనివాస్ భార్య మల్లేశ్వరి ( 19) దంపతులు గబ్బిలాల పేటలోని శ్రీ శ్రీ జ్ఞాన మందిర్ స్కూల్ దగ్గర నివాసమంటున్నారు. ఈనెల 26వ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీనివాస్ పనిమీద ఇంటి నుండి బయటకు వెళ్లగా ఆ సమయంలో మల్లేశ్వరి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు.
రాత్రి 11 గంటలకు శ్రీనివాస్ తిరిగి ఇంటికి రాగా భార్య మల్లేశ్వరి కనపడలేదు. ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికిన బంధువుల వద్ద వెతికిన తెలిసిన వారి వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు శ్రీనివాస్ భార్యకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఈ మేరకు శ్రీనివాస్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






