కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
పెట్రోల్ బంక్ నిర్వాహకులకు కలెక్టర్ల హెచ్చరిక
ఇంధనాల కొరత లేదని వెల్లడి
ఆదిలాబాద్/నిర్మల్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలకు అవసరంగ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రుతో కలిసి చమురు కంపెనీల సేల్స్ అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
అంతకుముందు చమురు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన గూగుల్ మీట్లో, డిపోల నుండి బంకులకు చేరుతున్న సరఫరా తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పెట్రోల్, డీజిల్ ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రవాణా ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పెట్రో ల్ బంకుల వద్ద ఇంధన లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ చేసిన, కృత్రిమ కొరత సృష్టించి నా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమిం చి నిల్వలను దాచిపెట్టి వినియోగదారులను ఇబ్బంది పెడితే, వారిపై నిత్యావసర వస్తువుల చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను లేదా పుకార్లను నమ్మి ప్రజలు భయాందోళనకు గురై బంకుల వద్ద క్యూ కట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, జిల్లా పెట్రోల్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు: కలెక్టర్ భవేశ్ మిశ్రా
పెట్రోల్, డీజిల్ సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సంబంధిత అధికారులతో మంగళవారం జిల్లా కలెక్ట ర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకుల వివరాలు, రోజువారీగా పెట్రోల్, డీజి ల్ అమ్మకాల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు తప్పనిసరిగా వచ్చిన స్టాక్, అమ్మిన స్టాక్, మిగిలిన స్టాక్ వివరాలు డైలీ స్టాక్ రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
ఎవరికి కూడా అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ ఇవ్వరాద న్నారు. పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణా, నిల్వ చేయకూడదన్నారు. కృత్రిమ కొరత సృష్టించరాదని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణాపై ప్రత్యేకంగా ఉంచాలన్నారు. జిల్లా ప్రజల అవసరా లను మేరకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్, ఏఎస్పీ లు అజ్మీరా సంకేత్ కుమార్, సాయి కిరణ్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారి రాజేందర్, డిఎంహెచ్‌ఓ రాజేందర్, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, అంబాజీ, మోహన్ సింగ్, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
బంకుల్లో నో స్టాక్ బోర్డులు..
నిర్మల్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కో రుత ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి జిల్లాలోని పలు పెట్రోల్ డీజిల్ బ్యాంకుల్లో పెట్రోల్ డీజిల్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా ఖానాపూర్ ముధూల్ బాసర్ సారంగాపూర్ కుంటాల దిల్వార్పూర్ లోకేశ్వరం తదితర ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకుల వద్దకు వస్తున్న వాహనదారులు రైతులు పెట్రోల్ డీజిల్ ధర లేక నిరాశతో వెన్ను తిరుగుతున్నారు.
ముఖ్యంగా వ్యవసాయ సీజన్ కావడం మొక్క వరిజొన్న జొన్న కోతలు కోస్తున్న నేపథ్యంలో హార్వెస్టర్లకు తప్పనిసరిగా డీజిల్ పెద్ద మొత్తంలో వినియోగం చేస్తున్నారు. దీంతో డీజిల్ దొరకక హార్వెస్టర్లు యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. చాలా గ్రామాల్లో రైతులు తమ పంటలు కోయడానికి డీజిల్ అవసరం కావడంతో ఎక్కడ పెట్రోల్ డీజిల్ దొరికితే అక్కడికి పరుగులు తీస్తూ క్యూ లైన్లు కడుతున్నారు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ కో రుత లేదని అధికారు లు చెప్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం దొరకడం లేదని వాహనదారులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నూతన బాధ్యతలు చేపట్టిన నిర్మల్ కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పెట్రోల్ డీజిల్ కోరుతా లేకుండా పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.






