28 April, 2026 | 10:05 PM

గోపాల్పేట్ బస్టాండ్ ప్రాంగణంలో అక్రమ దుకాణాలను తొలగింపు

28-04-2026 08:55 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అక్రమంగా పండ్లు,కూరగాయల దుకాణాలను వివిధ షాపులను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగించడంతో ప్రజలకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నారు. స్థానిక గ్రామ కార్యదర్శి నోటీసులు ఇచ్చినప్పటికీ దుకాణాలను తొలగించకపోవడంతో బాన్సువాడ డిపో మేనేజర్ ఆదేశాలతో రంగంలోకి ఎస్.టి.ఐ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మంజుల దిగి ఏర్పాటు చేసుకున్నవాటిని దుకాణాలను వివిధ సముదాయాలను తొలగించడం జరిగింది.

బాన్సువాడ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు గోపాల్పేట్ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న వివిధ దుకాణాలను, సముదాయాలను ఎస్.టి.ఐ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మంజుల  తొలగించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గోపాల్పేట్ ఆర్టిసి బస్టాండ్ ప్రాంగణంలో ఎవరైనా అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకుంటే వాటిని తొలగించడంతోపాటు సీజ్ చేయడం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆమె వెంట వివిధ అధికారులు ఉన్నారు.