హౌతీల దూకుడు

17-09-2026 | 05:10am

చరిత్రలో మొదటిసారిగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా(Mecca) నగరానికి వైమానిక దాడులపై హెచ్చరికలు జారీ అయ్యాయి. సైరన్లు మోగాయి. మక్కా గగనతలంలోకి ప్రవేశించకముందే తాము ఒక డ్రోన్‌ను కూల్చివేశామని సౌదీ అరేబియా సైనిక దళాలు(Saudi Arabian military forces) ప్రకటించుకున్నా యి. కొంతకాలంగా సౌదీ అరేబియాకు హౌతీ తిరుగుబాటుదారుల దాడు లు తలనొప్పిగా మారాయి. ఇరాక్(Iraq) మద్దతుతో హౌతీలు సౌదీలోని కొన్ని నగరాలపై బాలిస్టిక్ క్షిపణులు(Ballistic missiles), డ్రోన్లతో మెరుపు దాడులు చేశారు.

అంతేకాదు, సౌదీకి కీలకమైన ఈస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌పై కూడా దాడులు చేసింది. మరోవైపు ఎర్ర సముద్రంలో వ్యూహాత్మకంగా పట్టు సాధించిన హౌతీలు, సౌదీ నౌకలపై దిగ్బంధం విధించారు. బాబ్‌న జలసంధిలోని దీవులు హనిష్, పెరుమ్‌లను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది సౌదీని సంకటస్థితిలో పడవేసింది. బాబ్  జలసంధి, ఎర్ర సముద్రం ద్వారా  ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం సరుకుల రవాణా సాగుతుంది. ఇప్పటికే హోర్మజ్ జలసంధి.. ముఖ్యంగా ఆసియా దేశాల వాణిజ్యాన్ని కుదేలు చేస్తుండగా, ఇప్పుడు ఎర్రసముద్రంలో హౌతీల పట్టు కలవరపరుస్తున్నది.

2015లో మొదలై ఏడేళ్లపాటు సాగిన యుద్ధం సౌదీ  హౌతీల మధ్య వైషమ్యాలను తగ్గించకపోగా అది అంతకంతకూ పెరిగింది. హౌతీల ఆగడాల ముందు యెమెన్ ప్రభుత్వం ఏనాడో చేతులెత్తే సింది. యెమెన్ చమురు నిక్షేపాలపై హౌతీలు వాటా డిమాండ్ చేశారు. అది సాధ్యపడకపోవడంతో సాయుధ పోరాటాన్ని ఆపలేదు. ఇరాన్‌పై ఈ ఏడాది సౌదీ వైమానిక దాడులకు పాల్పడటం హౌతీల పోరుకు ఆజ్యం పోసింది. ఇది సౌదీ నుంచి చమురు దిగుమతి చేసుకునే ఆసియా దేశాలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.

దాదాపు 70 శాతం చమురును సౌదీ ఎర్రసముద్రం నుంచే ఎగుమతి చేస్తున్నది. హౌతీల తీరుతో సౌదీ చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో సౌదీ యువరాజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సాయం కోరినట్టు వార్తలొచ్చాయి. అయితే తక్షణం జోక్యం చేసుకోబోమని ట్రంప్ చెప్పినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి.

ఇరాన్‌పై యుద్ధంతో ఆయుధ సంపత్తి వట్టిపోవడం అమెరికాను కుంగదీస్తుండగా..మరో యుద్ధంలో తలదూర్చడం ఎందుకని ట్రంప్ భావిస్తుండవచ్చు. మరోవైపు పాకిస్తాన్ కూడా సౌదీకి సాయంగా వ చ్చేందుకు సిద్ధంగా లేదు. అందుకే సౌదీ, ఇజ్రాయెల్ తలుపు తడుతున్నది. ఈ పరిస్థితుల్లో హౌతీల సమస్యను సౌదీ ఎలా అధిగమిస్తుందనేది చూడాలి. 

మరిన్ని వార్తలు