18 April, 2026 | 5:49 AM

రచయితల పేర్లు చదవకుండా.. కథలు వినిపిస్తే ఎలా?

12-05-2025 12:00 AM

సోషల్ మీడియా ఎంత ఉపయోగకర మో అంత ఆటంకకరంగానూ ఉండటం అం దరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతి విషయాన్నీ యూట్యూబులో పెట్టేయటం సర్వసాధారణమైంది. ప్రయాణాలు, వంటలకు సంబంధిం చి అయితే తెలియని వాళ్ళు తెలుసుకునే వీలుండటమే కాక ఎవరు తీసినవి వాళ్ళ చానెల్‌లో పెట్టుకోవచ్చు. కానీ, ఇప్పుడు అన్ని రకాల వీడియోలవి ఒక ఎత్తయితే కథల చానెల్స్ మరో ఎత్తుగా తయారైంది.

యూ ట్యూబ్ వీడియోలకు డబ్బు వస్తుండటంతో ప్రతి ఒక్కరూ నేడు యూట్యూబర్ అవుతున్నారు. దానికి ఎవరి అభ్యంతరమూ లేదు. సొంత తెలివితో ఎన్ని చానళ్ళు అయినా పెట్టుకోవచ్చు. కానీ, ఈమధ్య ఎన్నో ఆడియో కథల చానెళ్ళు కోకొల్లలుగా యూట్యూబ్ నిండా వెల్లువెత్తుతున్నాయి. అలాంటి చానె ల్స్ కొన్ని రచయితలవి అయితే ఇంకెన్నో రచయితలు కాని వాళ్ళవి ఉంటున్నాయి.

అందరు రచయితలకూ చానల్స్ ఉండాలన్న నియమం ఏమీ లేదు. వారికి చానల్ ఉంటే అక్కడ చదువుకుంటారు. లేదంటే పుస్తకాలు వేయించుకుని భద్రపరుచుకుంటారు. లేదా వారి ఇష్టంతో ఎవరైనా ఔత్సా హికులు అనుమతి తీసుకుని, తమ చానల్స్ లో అప్‌లోడ్ చేసుకుంటామని అడిగితే ఇష్టం ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. అయితే, ఇలా పర్మిషన్ ఇచ్చినా కథా రచయిత పేరు చెప్పి కథను చదవటం పద్ధతి.

కానీ, ఇప్పుడు ఎంద రో ఆడియో కథల చానళ్ళు పెట్టుకుని, కనీ సం రచయిత పేరు చెప్పకుండా, పర్మిషన్ అడగకుండా కథలు అప్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ విషయం సదరు రచయితకే తెలి యటం లేదు. ఎవరో తెలిసిన వాళ్ళు చూసి ‘ఈ కథమీది కదా? ఫలానా చానల్‌లో ఉం దని’ చెబితే తప్ప. అప్పుడు వారి చానల్‌లోని వీడియోల కింద కామెంట్లు పెట్టి నిలదీస్తే, ‘అడగాలనుకున్నాం.

కానీ, మీ ఫోన్ నెంబర్ లేదని’ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. మరీ గట్టిగా నిలదీస్తే మాత్రమే వీడియోని డిలీట్ చేస్తున్నారు. ఈ విధంగా ఎందరో రచయితలు కంప్లైంట్ చేస్తున్నా ఎక్కడో ఒక చాన ల్‌లో కళ్ళు గప్పి రచయిత పేరు ఏ మేగజైన్ లో పడిందో ఆ వివరాలు ఏ మాత్రం తెలుపకుండా పబ్లిష్ చేసుకుంటున్నారు. ఇటు వంటి చానల్స్‌ను ఏ విధంగా కట్టడి చేయా లో తెలియక కొందరు అడిగి అడిగి విసిగి పోతుంటే, మరికొందరు అడిగినా ప్రయోజ నం లేక వదిలేస్తున్నారు.

యూట్యూబ్ అన్న ది ఉపయోగకరమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ, ఇలా కథాచౌర్యం చేసే వాళ్ళపైన ఒక్కొక్కరే రచయితలు పోరాడలేక బాధ పడుతున్నారు. ఈ కథాచౌర్య పర్వాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే ప్రయత్నాలు జరగాలి.

 డేగల అనితాసూరి