calender_icon.png 17 February, 2026 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా న్యాయవాది హత్యపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

17-02-2026 12:00:00 AM

  1. డీజీపీకి నోటీసులు జారీ

ముందే ఫిర్యాదు చేసినా రక్షణ కల్పించలేదని మండిపాటు 

పోలీసుల నిర్లక్ష్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : చేవెళ్లలో జరిగిన మహి ళా న్యాయవాది జి. స్వప్న కుమారి (34) దారుణ హత్య కేసులో పోలీసుల పనితీరుపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బా ధితురాలు ప్రాణహాని ఉందని ముందే మొరపెట్టుకున్నా, పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమయ్యా రన్న ఆరో పణలను కమిషన్ సీరియస్‌గా పరిగణించింది.

ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై తక్షణమే విచారణ జరిపి, సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు సోమ వారం కమిషన్ చైర్మన్ డా క్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వులిచ్చారు. 

ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలే.. 

ఈ నెల 4వ తేదీన చేవెళ్ల పరిధిలో జరిగిన భూ వివాదంలో న్యాయవాది జి. స్వ ప్న కుమారి దారుణ హత్యకు గురైన విష యం తెలిసిందే. అయితే, ఈ హత్య జరగడానికి ముందే స్వప్న కుమారి తన సోద రుడి నుంచే తనకు ప్రాణహాని ఉందని మొయినాబాద్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు ఆ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని, సకాలంలో నివారణ చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.

పోలీసుల అలసత్వం కారణంగానే ఒక నిండు ప్రాణం బలయ్యిందని న్యాయవాద వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.తమ సహచర న్యాయ వాది హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఏకంగా 163 మంది న్యా యవాదులు మానవ హక్కు ల కమిషన్‌ను ఆశ్రయించారు.

న్యాయవాదుల ఫి ర్యాదును స్వీకరించిన చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను కోరారు. అసలు స్వప్న కుమా రి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు స్పందించలేదు.. రక్షణ కల్పించడంలో ఎక్కడ లోపం జరిగింది.. అన్న కోణాల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు.