టీఆర్పీలో భారీగా చేరికలు
ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు యాదగిరిగౌడ్
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల టీఆర్పీ అధ్యక్షుడు సిద్ధ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి రాష్ట్ర కార్యదర్శి బస్సాపురం నగేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు హిమపు రం యాదగిరి గౌడ్ ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో వెంకటరెడ్డి, దుర్గమణి, రామ మ్మ, శ్యామల, దేశమైన రామవ, లక్ష్మి, నవీన్, గుండ్ల శ్రీలత, ఎర్రగుల, స్వామి, శ్రీను ఎర్ర గొల్ల మహేష్, బ్యాగరీ యాదగిరి, మహేష్, శ్రీకాంత్, పిల్లి, దుర్గయ్య, నవీన్, శ్రీకాంత్ గోపాల్, శంకర్, షాదుల్, రాజు, రాజశేఖర్, వినయ్, ప్రశాంత్, నాగరాజు, అనిల్, ప్రకాష్, రాములు, మురారి, శేఖర్, ఆనంద్ ఉన్నారు.
కేయూలో టీఆర్‌వీఎస్ నూతన కమిటీ
కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన (టీఆర్‌వీఎస్) నూతన కమిటీని నియమించారు. పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ సూచనల మేరకు టీఆర్‌వీఎస్ రాష్ట్ర నాయకుడు పోలు రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా ఎం విజయ్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శరత్, జనరల్ సెక్రటరీగా నవీన్, వైస్ ప్రెసిడెంట్‌గా దినకర్ నియమితులయ్యారు.




