22 May, 2026 | 6:47 AM

భారీగా నగదు పట్టివేత

20-04-2024 01:52 AM

ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు

సరైన ఆధారాలు లేని నగదు సీజ్

కరీంనగర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టేందుకు పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. శుక్రవారం కరీంనగర్‌లో పలుచోట్ల తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకునా ్నరు. కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలోని రాజీవ్ చౌక్ వద్ద జనగం సుమన్ కళ్యాణ్ అనే వ్యక్తి నుంచి రూ.7 లక్షలు, టూ టౌన్ పరిధిలోని గీతాభవన్ చౌరస్తా వద్ద నెల్లి భాస్కర్ నుంచి రూ. 1,11,900, ఐబీ చౌరస్తా వద్ద కొల ప్రదీప్ కుమార్ నుంచి రూ.6,81,900, త్రీటౌన్ పరిధిలో గాండ్ల సురేష్ అనే వ్యక్తి నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధా రాలు చూపించక పోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు ఆయా స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు జె. సరిలాల్, విజయ్ కుమార్, జాన్ రెడ్డి వెల్లడించారు. 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో..

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : వాంకిడి మండలంలోని టోల్ ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద రూ.71,500 పట్టుకున్నట్లు ఎస్సై సాగర్ తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన గొడిసెలవార్ నరేందర్ కారులో సిద్దిపేట వైపు వెళ్తుండగా తనిఖీ చేయగా నగదు లభ్యమైందని చెప్పారు. నగదు సీజ్ చేసి ఎఫ్‌ఎస్‌టీ టీమ్‌కు అప్పగించినట్లు వివరించారు.