చైర్మన్ సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: మనదేశం 2047 కల్లా 35 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యం ఏర్పరచుకుని, ముందుకు సాగుతుండటం వల్ల, భారతీ ఎయిర్టెల్కు అపార వృద్ధి అవకాశాలను లభిస్తాయని ఆ సంస్థ చైర్మన్ సునీల్ మిత్తల్ తెలిపారు. కొత్త విభాగాల్లో వ్యాపారావకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ విభాగంలో భారత్ వృద్ధి వేగవంతం కావడంలో 5జీ కీలక పాత్ర పోషిస్తుందని మిత్తల్ తెలిపారు. డిజిటలీకరణ లక్ష్యాన్ని సాధించేందుకు, ఎయిర్టెల్ ముందుండి తన వంతు ప్రయత్నం చేస్తుందని. విధాన రూపకర్తలు, సంబంధిత వాటాదార్లతో కలిసి పనిచేస్తుందని అన్నారు.
వ్యక్తులు. వ్యాపార సంస్థలకు సురక్షిత డిజిటల్ సొల్యూషన్లను అందించేందుకు ఎయిర్టెల్ 50 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.4,15,000 కోట్లు) పైగా పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. ఇంటర్నెట్ వ్యాప్తి, ఇంటర్నెట్ ఆధారిత కార్యకలాపాలు పెరగడం ద్వారా గతేడాది డిజిట్జలీకరణలో గణనీయ పురోగతి కనిపించిందని మిత్తల్ వెల్లడించారు. దేశ జీడీపీలో భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా సుమారు 11 శాతంగా ఉందని అన్నారు. భారత్ 1 లక్ష కోట్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనను వేగవంతం. చేసేందుకు ప్రైవేట్ రంగం సహా సంబంధిత వర్గాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.