28 August, 2026 | 4:30 AM

భారత్, కివీస్ సిరీస్‌కు ఫుల్ క్రేజ్

28-08-2026 12:28 AM

హాట్ కేకుల్లా ప్రీ సేల్ టిక్కెట్లు

వెల్లింగ్టన్, ఆగస్టు 27 : టీమిండియా(Team Indi) ఎక్కడ క్రికెట్ సిరీస్ ఆడినా ఫుల్ క్రేజ్ ఉంటుంది. తాజాగా న్యూజిలాండ్‌(New Zealand)తో రెండు నెలల త ర్వాత జరగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్‌(multi-format series)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రీ సేల్ టిక్కెట్ల(pre-sale tickets) అమ్మకమే దీనికి నిదర్శనం.  మొదటి 48 గంటల్లోనే ప్రీ-సేల్ ద్వారా 26,000 టిక్కెట్లు అమ్ముడ య్యాయి. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జ రిగే పరిమిత ఓవర్ల మ్యాచ్లకు టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

క్రైస్ట్‌చర్చ్‌లోని 9 వేల సీట్ల హాగ్లీ ఓవల్‌కు టికెట్ల విక్రయాలు జోరు గా సాగుతున్నాయి. ప్రస్తుత డిమాండ్ ప్రకా రం చూస్తే.. అక్టోబర్ 22, 24 తేదీల్లో జరిగే తొలి రెండు టీ20లకు ఈ స్టేడియం పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే రెండో టె స్టుకు కూడా భారీ స్పందన వస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగే మ్యాచుల టికెట్లకు డి మాండ్ పెరిగింది.

భారత పర్యటనపై క్రికెట్ అభిమానుల్లో ఉన్న ఉత్సాహమే రికార్డు విక్రయాలకు కారణమని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ గ్లెన్ క్రిచ్లీ తెలిపారు. సాధారణ ప్రజల కోసం టిక్కెట్ల విక్రయాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రా రంభం కానున్నాయి. అక్టోబర్ - డిసెంబర్ మధ్య భారత్ జ ట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది.   12 మ్యాచ్ లు (టీ20లు, వన్డేలు, టెస్ట్‌లు) జరగనున్నాయి.