కాంగ్రెస్‌కు భారీగా పెరిగిన ఓటింగ్ శాతం
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీగా ఓటింగ్ శాతం పెరిగింది. 2019 ఎన్నికల్లో కంటే ఈసారి అధికంగా లాభించింది. 2019 ఎన్నికల్లో 29.48 శాతం ఓట్లు పోలైతే, ఈసారి 40.10 శాతానికి పెరిగింది. బీఆర్‌ఎస్‌కు 2019లో 41.29 శాతం ఓట్లు పడగా, ఈ సారి 16.68 శాతానికి దిగజారింది. రెండు పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ 23.42 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. బీజేపీ సైతం ఓటు శాతాన్ని పెంచుకుంది. 2019కంటే 15.63శాతం అధికంగా ఓట్లు రాబట్టుకుని బీఆర్‌ఎస్‌ను కిందకు తొక్కేసింది. అందుకే 2019లో 9 స్థానాల్లో గెలిచిన బీఆర్‌ఎస్ ఈసారి కనీసం ఖాతా కూడా తెర్వలేకపోయిది. మొత్తం 17 స్థానాల్లో 8 చోట్ల కాంగ్రెస్ పార్టీ, 8 సీట్లు బీజేపీ గెలవగా, ఎంఐఎం ఒక సీటులో గెలుపొంది కారు పార్టీ ఓట్లను కమాయించాయి.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓటింగ్ శాతం...
కాంగ్రెస్ 40.10
బీఆర్‌ఎస్ 16.68
బీజేపీ 35.08
ఎంఐఎం 3.02
బీఎస్పీ 0.41
సీపీఎం 0.13
ఏఐఎఫ్‌బీ 0.20
నోటా 0.47
ఇతరులు 3.90
గెలుపొందిన సీట్లు
కాంగ్రెస్ 8
బీజేపీ 8
ఎంఐఎం 1
మొత్తం 17






