28 June, 2026 | 3:13 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా హనుమకొండలో భారీ ర్యాలీ

10-05-2025 01:19 AM

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్ బోడ డిన్న

హనుమకొండ, మే 9 (విజయ క్రాంతి): హనుమకొండ వేయి స్తంభాల గుడి నుండి హనుమకొండ చౌరస్తా వరకు శుక్రవారం రోజున మాజీ కార్పొరేటర్ బోడ డిన్న ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగ బోడ డిన్న మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు  భారతదేశంలో చొరబడి  దొంగ దెబ్బ తీసి  సుమారు 27 మంది భారత పౌరులను హతమార్చి మన దేశ ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపేస్తే, నా భారత దేశ ఆడబిడ్డలు  త్రివిధ దళాలకు నాయకత్వం వహించిన సోఫియా ఖురేషి ,

వ్యోమీకా సింగ్ కేవలం ఇద్దరూ  పాకిస్తాన్  ఉగ్ర స్థావరాలను  లక్ష్యంగా చేసుకొని  కేవలం 25 నిమిషాలలో  సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చి భారతదేశ సత్తా ఏంటో నిరూపించి పాకిస్తాన్ కు  గుణపాఠం చెప్పారు. జనగాని శంకర్, సందీప్ రెడ్డి, ఇక్బాల్ హుస్సేన్, కురషీద్, చెరుకు సందీప్, విశాల్ బాబు, దయాకర్, సాయి, అబేడ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.