30 June, 2026 | 1:54 AM

కేఎల్ యూనివర్సిటీకి భారీ విజయం

30-06-2026 01:00 AM

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 1,534 మందికి టీసీఎస్ ఉద్యోగాలు

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతమైన రికార్డు సృష్టించారు. 2027 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ పూర్తి చేయనున్న విద్యా ర్థుల కోసం నిర్వహించిన తొలి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ఒకేసారి 1,534 మంది విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు ఇచ్చింది. ఎంపికైన వారిలో విజయవాడ క్యాంపస్‌కు చెందిన 1,311 మంది, హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన 223 మంది విద్యార్థులు ఉన్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్ధసారధి వర్మ తెలిపారు.

గత వారం రోజులుగా నిర్వహించిన రాత పరీక్ష, కోడింగ్ పరీక్ష, వ్యక్తిగత ఇం టర్వ్యూలలో ప్రతిభ కనబరిచి విద్యార్థులు ఈ ఉద్యోగాలను సాధించారని చెప్పారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు 100 శాతం క్యాంపస్ ప్లేస్మెంట్లు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ పార్ధసారధి వర్మ తెలిపారు. ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా 450కిపైగా కంపెనీలతో యూనివ ర్సిటీ ఒప్పందాలు చేసుకుందని, జపాన్, జర్మనీ, దుబాయ్ వంటి దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల్లో కూడా తమ విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.