మానవత్వం చాటిన ఎమ్మెల్యే కసిరెడ్డి

26-04-2024 12:10:00 AM

రంగారెడ్డి, ఏప్రిల్ 25 (విజయక్రాం తి): కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మానవత్వం చాటారు. గురు వారం నియోజకవర్గంలో పర్యటించి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఇదే సమయంలో చారగొండ మండలంలోని గోకారం గ్రామానికి చెందిన మహేష్ కడ్తాల వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన ఆయన వెంటనే తన వాహనాన్ని పక్కకు నిలిపి బాధితుడి దగ్గరికి వెళ్లారు. అనంతరం తన వ్యక్తిగత సిబ్బంది, కార్యకర్తల సహాయంతో తన వాహనంలోనే బాధితున్ని స్థానిక దవాఖానకు తరలించారు.