ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు
l ఎన్నికల పరిశీలకులు రాజీవ్ చోప్ర, సమీర్ మాధవ్, గోపాల్‌జీ తివారీ
తాండూరు/నర్సాపూర్/నారాయణఖేడ్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : వచ్చేనెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల లెక్కలు తప్పనిసరిగా రోజు వారీగా నమోదు చేయాలని ఎన్నికల పరిశీలకుడు రాజీవ్ చోప్ర, తాండూరు ఆర్డీవో, ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌రావును ఆదేశించారు. గురువారం తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచార వాహనాలు, దినసరి ఖర్చు లు తప్పనిసరిగా లెక్కలు నమోదు చేయాలని సూచించారు. అదే విధంగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని చెక్‌పోస్టు లను పరిశీలించారు.
l మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ జనర ల్ అబ్జర్వర్ సమీర్ మాధవ్ నర్సాపూర్‌లో గవర్నమెంట్ జూనియర్ కళాశాల లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని గురువారం పరిశీలించి అక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అబ్జర్వర్ మల్లన్నగుడి వద్ద ఉన్న చెక్‌పోస్టు, శభాష్‌పల్లి క్రాస్ రోడ్డు చెక్‌పోస్టు, మల్కాపూర్ క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టును పరిశీలించారు. చెక్‌పోస్టుల వద్ద ఉన్న ఎస్‌టీ టీం లీడర్లకు తనిఖీలపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
l ఎంపీ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ జనరల్ అబ్జర్వర్ అధికారి గోపాల్‌జీ తివారి (ఐఏఎస్) అధికారి నారాయణఖేడ్ ఆర్డీవో అశోక చక్రవర్తితో కలిసి గురువారం నియోజకరవ్గంలో పలు పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. ఖేడ్‌లో భద్రపరిచిన ఈవీఎంల సెంటర్‌ను పరిశీలించి భద్రతా చర్యల గురించి డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు.






