ఎండలో కూల్ కూల్‌గా..
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నాలుగైదు రోజులుగా పగటి ఊష్ణోగ్రతలు 40డిగ్రీల కంటే తక్కువ నమోదు కావడం లేదు. నగరంలోని ప్రజలు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకు కూడళ్లలో విక్రయిస్తున్న పుచ్చకాయ, లస్సీ, కీర దోసకాయ, కొబ్బరి నీరు, పుదీనా జ్యూస్, నిమ్మకాయ సోడ వంటివి శీతల పానియాలు సేవిస్తున్నారు. ఇవే కాకుండా ఐస్ క్రీం పార్లర్ల వద్ద బారులు తీరుతున్నారు. అయితే సమ్మర్‌లో తేలికగా ఉండే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని, రోడ్లపై ఐస్ కలిపిన ఆహార పదార్థాలను, జ్యూస్‌లను తీసుకొవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర సమయంలో బయటకు వచ్చేవాళ్లు తమ వెంట ఓ బాటిల్‌లో లెమన్ వాటర్‌తో పాటు కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, చెరుకు జ్యూస్‌ను వెంట తీసుకెళ్లడం ఉత్తమమని వైద్యులు సలహా ఇస్తున్నారు.






