31 July, 2026 | 1:27 AM

శ్రీ చక్రేశ్వర శివ ఆలయంలో హుండీ లెక్కింపు

31-07-2026 12:48 AM

రూ.1.39 లక్షల ఆదాయం

బోధన్, జులై 30 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుజాతా రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తుల సమక్షంలో హుండీలను తెరిచి నగదు లెక్కింపు చేపట్టారు.

హుండీల లెక్కింపులో మొత్తం రూ.1,39,192 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ నాయకం రాములు, అభివృద్ధి కమిటీ సభ్యులు లక్ష్మణ్ పటేల్, ఏ. శంకర్, ఈ. మౌనిక పోశెట్టి, గంగాధర్, ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మ, మహేష్ పాఠక్, ఆలయ సిబ్బంది సుధాకర్, వాసవి క్లబ్ సభ్యులు మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు.