31 July, 2026 | 1:12 AM

కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్

31-07-2026 12:49 AM

బాన్సువాడ, జూలై 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో వీధి కుక్కల దాడిలో గాయపడి నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని గురువారం బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్  పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.