12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

సాహిత్యంలో హంగేరియన్ రచయితకు నోబెల్

10-10-2025 01:38 AM
  1. లాస్టో క్రాస్జ్నోహోర్కై దార్శనిక రచనలకు దక్కిన అరుదైన గౌరవం
  2. భయానక పరిస్థితుల్లోనూ కళా శక్తిని చాటారన్న నోబెల్ కమిటీ
  3. ప్రపంచ సాహిత్యంలో అత్యున్నత పురస్కారంగా గుర్తింపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: సాహిత్య రంగం లో ఈ ఏడాది హంగేరియన్ నవలా రచయిత లాస్టో క్రాస్జ్నోహోర్కైకి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. లాస్టో క్రాస్జ్నోహోర్కై విలక్షణమైన, దార్శనిక రచనలకు ఈ అత్యున్నత బహుమతి దక్కినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గురువారం అధికారికంగా ప్రకటించింది.ప్రపంచ వినాశనం వంటి తీవ్ర భయానక పరిస్థితుల మధ్య కూడా కళకు ఉన్న అపారమైన శక్తిని తన రచనల ద్వారా బలంగా చాటి చెప్పినందుకు లాస్లోకు ఈ గౌరవం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది.

ఆయన సాహిత్యం సమకాలీన ప్రపంచంలోని సంక్లిష్టతలను, మానవ అస్తిత్వ వేదనను వినూత్న శైలిలో ఆవిష్కరిస్తుందని ప్రశంసించింది.లాస్లో క్రాస్నహార్కై తన రచనలతో ఆధునిక సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు నోబెల్ బహుమతితో ఆయన కీర్తి విశ్వవ్యాప్తమైంది. కాగా గతేడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే.