10-10-2025 01:34:41 AM
‘పీస్ ప్రెసిడెంట్’ అంటూ ఎక్స్‌లో ట్వీట్
న్యూయార్క్, అక్టోబర్ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం పరితపిస్తున్న సంగతి తెలిసిందే. తా జాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికాలోని వైట్‌హౌస్‌లో సంబరాలు చేసుకోవడం ఆస క్తికరంగా మారింది.
ఈ సంబరాల వె నుక అసలు కారణం నోబెల్ శాంతి బ హుమతి ప్రకటించడానికి ఒక్కరోజు ముందే ఇజ్రాయెల్, హ మాస్ మధ్య శాంతి ఒప్పందం జరగడ మే.ఈ చర్యతో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి మరింత దగ్గరయ్యారనివైట్ హౌస్ తమ సామాజిక మా ధ్యమం ‘ఎక్స్’లో పేర్కొంది. అంతేగా క 79 ఏళ్ల ట్రంప్ శాంతి కాముకుడు (పీస్ ప్రెసిడెంట్) అని ట్వీట్ చేసిం ది.కాగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌తో పాటు 338 మంది పోటీలో ఉన్నారు.