15 April, 2026 | 11:26 PM

నేటి నుంచి ఓయూలో నిరాహార దీక్షలు

04-11-2025 01:39 AM

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, నవంబర్ ౩ (విజయక్రాం తి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లను పార్టీల పరంగా కాకుండా రాజ్యాం గ బద్ధంగా ఇవ్వాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశా రు. అప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. ఇదే డిమాండ్‌తో మంగళవారం నుంచి ఓయూలో నిరాహార దీక్షలు చేపట్టుతున్నట్లు తెలిపారు.

సోమ వా రం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర  కార్యదర్శి ఎత్తరి భీమ్ రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథి కృష్ణయ్య మాట్లాడారు. ఇటీ వల శాంతియుత బీసీ బంద్‌లో పాల్గొన్న బీసీ సంఘాల నేతలపై కేసులు పెట్టడం ఎం తవరకు సమంజసమని, కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఉ ద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. జాతీ య బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసి డెంట్ నీల వెంకటేష్, నేతలు లక్ష్మణ్, నరేష్ గౌడ్, బోయ గోపి, కిషోర్ యాదవ్, నిఖిల్ ప టేల్, మోడీ రామ్‌దేవ్, ఎం.నగేష్‌ఉన్నారు.