15 April, 2026 | 11:28 PM

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

04-11-2025 01:38 AM
  1. జియో సెల్ టవర్స్ టార్గెట్ * డీజిల్ బ్యాటరీలు దొంగతనం 
  2. వివిధ జిల్లాలో దొంగతనాలు *రూ.3 లక్షల నగదు స్వాధీనం

సిద్దిపేట, అక్టోబర్ 3 (విజయక్రాంతి): 5మంది ముఠాగా ఏర్పడి పలు జిల్లాలలో దొంగత నాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగలను సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. సోమవారం నిందితులను రిమాండ్ పంపించిన సందర్భంగా పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో 16 జియో సెల్ టవర్ల వద్ద డీజిల్, బ్యాటరీలు దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా గజ్వేల్ ఏసిపి నర్సింలు, తొగుట సిఐ లతీఫ్, సిసిఎస్ సిఐ అంజయ్య పోలీస్ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు.

సిద్దిపేట జిల్లాలో 16, జగిత్యాలలో 24, జనగామలో 4, యాదాద్రి భువనగిరిలో 3, సూర్య పేటలో 1 చొప్పున వీరిపై కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలి పారు. 5 మంది దొంగతనాలకు పాల్పడుతూ మరో ఆరుగురికి వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారని వెల్లడించారు. దొంగ వస్తువులను కొనుగోలు చేసిన వారిని సైతం చట్టం శిక్షి స్తుందని తెలిపారు. వాహనాలు, బ్యాటరీలు, రూ.3లక్షల 1వెయ్యి నగదును స్వాధీన చేసుకున్నా రు. జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపుతామని కమిషనర్ హెచ్చ రించారు. అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులను, కానిస్టేబుల్ అభినందించారు.