15 June, 2026 | 1:26 AM

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

15-06-2026 12:00 AM

పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో విషాదం

అంతర్గాం, జూన్ 14(విజయ క్రాంతి) అనుమానం పెనుభూతమై నిండు ప్రాణాన్ని బలితీ సుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, విచక్షణ కోల్పోయి గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూరు గ్రామంలో కలకలం రేపిం ది. పోలీసుల కథనం ప్రకారం.. ముర్మూరు గ్రా మానికి చెందిన రాయమల్లుకు, తన భార్య నంది లక్ష్మితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆమెపై అనుమానం పెంచుకున్న రాయ మల్లు, శనివారం అర్ధరాత్రి సమయంలో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన నిందితుడు గొడ్డలితో లక్ష్మిని విచక్షణారహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న రామగుండం సీఐ కృష్ణకుమార్, అంతర్గాం ఎస్‌ఐ వెంకటస్వామి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

తీరని శోకం

మృతురాలు లక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి దారుణ హత్యకు గురికావడంతో పిల్లలు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.