15 June, 2026 | 1:29 AM

సద్దనోనిపల్లి గ్రామంలో చినుకు పడితే చిత్తడి.. చిత్తడి..

15-06-2026 12:00 AM

మల్దకల్ జూన్ 14: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని సదలోనిపల్లి గ్రామంలో స్వల్పంగా వర్షం కురిసిన రహదారులు నీటి మయంగా మారుతున్నాయి గ్రామంలోని ప్రధాన వీధులు అంతర్గత రోడ్లపై నీరు నిలువ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాదాచార్యులు విద్యార్థులు వృద్ధులు వృద్దులు నడవాల్సి వస్తుండగా వాహనదారులు కూడా రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థతి పునర్వృతంమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో రహదారులు కాలువలు అభివృద్ధి పనులు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు