31 March, 2026 | 12:16 PM

ఆమనగల్లులో ఘోరం.. క్షణికావేశం నిండు ప్రాణాలను బలితీసుకుంది

31-03-2026 10:39 AM
  1. మద్యం మత్తులో భార్య, ఇద్దరు పిల్లలను నరికి  కిరాతకుడు
  2. భార్య కొడుకు అక్కడికక్కడే మృతి,
  3. కూతురు పరిస్థితి విషమం 

​ఆమనగల్లు,(విజయక్రాంతి): క్షణికావేశం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను కడతేర్చిన హృదయవిదారక ఘటన అమంగల్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.​స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మండలం సీతారాం నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తండాకు చెందిన బాణావత్ రాందాస్ అనే వ్యక్తి మద్యం బానిస. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి రాందాస్ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.​

ఈ క్రమంలో భార్య కవితతో గొడవ మొదలైంది. గొడవ ముదరడంతో రాందాస్ తీవ్ర ఆగ్రహానికి లోనై, ఇంట్లో ఉన్న కత్తితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను అడ్డుకోబోయిన కుమారుడు హర్ష, కూతురు ప్రణీతలను కూడా కిరాతకంగా నరికాడు.​నిందితుడు చేసిన దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య కవితతో పాటు కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కూతురు పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో  మెరుగైన వైద్యచికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

విగతజీవులుగా పడి ఉన్న ఆ ముగ్గురిని చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు. ​"చిన్న గొడవకు ఇంత ఘాతుకానికి ఒడిగడతాడని అనుకోలేదు. ఆ పసిపిల్లల ఏం పాపం చేశారని వారిని కూడా చంపేశాడా ?" అంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​పోలీసుల దర్యాప్తు ​సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో కుటుంబానికి ఆధారంగా ఉండాల్సిన తండ్రే.. కాలయముడిలా మారి కుటుంబాన్ని అంతం చేయడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.