24 June, 2026 | 10:31 AM

మూఢనమ్మకాలు సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి: సీఐ రవీందర్

24-06-2026 09:39 AM

రుద్రంగి జూన్23(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలో పోలీసు శాఖ ఎస్ఐ మోతిరామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో మూఢనమ్మకాలు,సైబర్ నేరాలు,రోడ్ ప్రమాదాలు మరియు డ్రగ్ వినియోగంతో వచ్చే పరిమానలపై మ్యాజిక్ షో, మిమిక్రి కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహనా కల్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చెర్మన్ చేలుకల తిరుపతి పాల్గొన్నారు ఈసందర్బంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ ప్రజలు పిల్లల పరివర్తన ఎప్పటికి అప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, అంతే కాకుండా సెలఫోన్ లోకి వచ్చే సైబర్ నేరగాళ్ల కాల్స్ కి ఓటీపీ చెప్పవద్దని, మైనర్లకు బైక్లు ఇవ్వొద్దని, మూఢనమ్మకాలు లాంటివి నమ్మి ప్రజలు మోసపోవద్దని తాగు సూచనలు చేసారు. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియి ప్రజలు పాల్గొన్నారు