15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అనుమానంతో భార్యను చంపిన భర్త

01-06-2025 10:20 PM

కొండపాక: అక్రమ సంబంధం ఉందని అనుమానంతో భార్యను భర్త పారతో తలపై కొట్టి హతమార్చిన సంఘటన కొండపాక(Kondapaka)లో చోటుచేసుకుంది. కుకునూరు పల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండపాక గ్రామానికి చెందిన పొన్నాల మల్లేశం(49) అనే వ్యక్తికి సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన యశోదతో 2003 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత ఆరు నెలల నుంచి మల్లేశం భార్య యశోదతో గొడవ పడుతూ కొడుతుండేవాడు.

అప్పుడప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చేవాడు. ఇంట్లో పదేపదే గొడవ పడుతుండడంతో కుటుంబీకులు బంధువులు గ్రామస్తులు నచ్చ చెప్పినప్పటికీ అలాగే వ్యవహరించాడు. ప్రతి చిన్న విషయానికి గొడవపడి కొట్టేవాడు. భార్యతో గొడవపడి వారం రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆయన శనివారం తిరిగి గ్రామానికి చేరుకొని ఇంటికి వచ్చాడు. యశోద(45) గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో హాస్టల్లో పనిచేస్తుంది. మధ్యాహ్నం పని ముగించుకొని ఇంటికి వచ్చింది.

ఇంటికి వచ్చినా యశోదతో ఏమీ మాట్లాడకుండా మల్లేశం బయటకు వెళ్లిపోయాడు. బయటకు వెళుతున్న మల్లేషమును భార్య యశోద, కూతురు అనూషలు వెళ్లి బయట ఎందుకు తిరుగుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడ్డుకొని ఇంటికి రమ్మని పిలిచారు. దాంతో ఆయన తిట్టుకుంటూ ముందుకు వెళ్లి ఇంటి ముందు గలా పార తీసుకొని యశోద తలపై కొట్టాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలు సోదరుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.