19-07-2025 11:50:17 AM
అమరావతి: అనుమానం, వివాహేతర సంబంధాల కారణంగా ఈ మధ్య కాలంలో హత్యలు పెరుగుతున్నాయి. తాజాగా కడప జిల్లా(Kadapa District) చాపాడు మండలం పెద్ద చీపాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే భార్య సుజాతను చంపినట్లు భర్త గోపాల్ వెల్లడించాడు. రెండు రోజులు క్రితం హత్య చేసిన శవాన్ని వనిపెంట అటవీప్రాంతంలో పడేసినట్లు పోలీసులకు గోపాల్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చాపాడు పోలీసులు మృతదేహం కోసం అడవిలో గాలిస్తున్నారు.