3 March, 2026 | 11:01 AM

ఘనంగా హుస్సేన్‌పూర్ పాఠశాల వార్షికోత్సవం

03-03-2026 12:21 AM

కేరింతల మధ్య చిన్నారుల సాంస్కృతి కార్యక్రమాలు 

కొడంగల్, మార్చి -2.( విజయక్రాంతి ) కొడంగల్ మండల పరిధిలోని హుస్సేన్ పూర్ గ్రామం లో ని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పం చ్ దొడ్ల అంజయ్య ముఖ్యఅతిథిగా హాజరైనారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాల విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పిస్తూ సమా జంలోని మానవతా విలువలు తెలిసేలా విద్యాబోధనలు చేయాలని గుర్తు చేశారు.

పాఠశాలలోని విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండెలా విద్యార్థులను ప్రోత్స హించ డంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుని,విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకు న్నాయి. ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రధానోపాధ్యాయులు రవీందర్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్రాంతి కుమార్, ఉపాధ్యాయురాలు సంధ్య, మరియు మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు,పంచాయతీ కార్యదర్శి కొండప్ప, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.