calender_icon.png 13 November, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా క్రికెట్ జట్టుకి హైదరాబాద్ కుర్రోడు

12-11-2025 10:51:10 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ నుండి యువ క్రికెటర్ అండర్-19 ఇండియా టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన మహమ్మద్ మాలిక్ ను బీసీసీఐ అండర్-19 ఏ టీమ్ లో అవకాశం కల్పించింది. ఇటీవల బీసీసీఐ నిర్వహించిన అండర్-19 వినూ మాంకడ్ ట్రోఫీలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ మాలిక్ టాప్ వికెట్ టెకర్ గా నిలవడంతో ఈ అవకాశం దక్కింది. దీనితో అతని తండ్రి మహ్మద్ అబ్దుల్ సుబాన్ ఆధ్వర్యంలో లక్డికాపుల్ లో మ్యాగ్నెట్ ఇన్ఫ్రా సంస్థ కార్యాలయంలోని సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి సంబరాలు చేశారు.

ఇండియన్ పాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేరణతో ప్రాక్టీస్ చేసి, అండర్ 19 టీమ్ కు సెలెక్ట్ అయినట్లు మహమ్మద్ మాలిక్ తెలిపారు. ఈ నెల 17న బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న సిరీస్ లో పాల్గొననున్నట్లు మాలిక్ అన్నారు. భవిష్యత్తులో ఇండియన్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించడం తన డ్రీమ్ అన్నారు. ఆ దిశగా తాను మెరుగైన ప్రదర్శన ఇస్తానని మాలిక్ స్పష్టం చేశారు. తాను కూడా క్రికెటర్ నేనని ఇండియా టీంకి ఆడాలనే కోరిక తన కొడుకు ద్వారా నెరవేరిందని తండ్రి మామ దబ్దుల్ సుభాన్ తెలిపారు. తాను కూడా క్రికెటర్ నేనని, ఇండియా టీంకి ఆడాలనే కోరిక తన కొడుకు ద్వారా నెరవేరిందని తండ్రి మహమ్మద్ అబ్దుల్ సుభాన్ తెలిపారు.