calender_icon.png 12 November, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫారీ సవాల్‌కు సిద్ధం

12-11-2025 12:00:51 AM

-ప్రాక్టీస్‌లో బిజీబిజీగా భారత్

-14 నుంచి తొలి టెస్ట్ 

-డబ్ల్యూటీసీలో టాప్ ప్లేస్‌కు చేరే ఛాన్స్

కోల్‌కత్తా, నవంబర్ 11: భారత జట్టు ఇప్పు డు టెస్ట్ ఫార్మాట్ మూడ్‌లోకి వచ్చేసింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ కోసం సన్నద్ధమవు తోంది. శుక్రవారం నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ మొదలుకాబోతోంది. ఇప్పటికే భారత క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్‌లో బిజిబిజీగా ఉన్నారు.

ఆస్ట్రేలి యా టీ20 సిరీస్ ముగియగానే నేరుగా వచ్చేసిన గిల్, బుమ్రా, అక్షర్ పటేల్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సౌతాఫ్రికా ఏ జట్టుతో రెండో అనధికారిక టెస్ట్ ముగిసిన వెంటనే పంత్, సిరాజ్, కుల్దీ ప్, జురెల్ వం టి ప్లేయర్స్ కూడా జట్టుతో కలిసారు. ప్రస్తుతం సిరీస్‌లో శుభారం భం చేయాలని భావిస్తున్న టీమిండియా నెట్స్ లో చెమటోడుస్తోంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ ఆడుతున్న మూడో సిరీ స్ ఇది.

తొలి సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు ఆడి న టీమిండియా 2 సమం చేసింది. తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2 క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడో స్థానంలో కొనసాగుతోం ది. ఇప్పటి వరకూ 7 టెస్టులు ఆడి 4 విజయాలు, 2 ఓటములు, 1 డ్రాతో 61.90 విజయశాతంతో మూడో ప్లేస్ లో నిలిచింది. మరోవైపు సౌతాఫ్రికా నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ టూర్‌కు ముందు పాక్ వెళ్ళిన సఫారీలు 2 టెస్టుల సిరీస్‌ను 1 సమంగా ముగించారు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ప్రస్తుత సిరీస్ కీలకం కానుంది.

సౌతాఫ్రికాపై భారత్ 2 క్లీన్‌స్వీప్ చేస్తే అగ్రస్థానానికి చేరువయ్యే అవకాశముంది. ఇటీవల వెస్టిండీస్‌పై ఆడిన జట్టునే దాదాపుగా సౌతాఫ్రికా సిరీస్‌కూ కొనసాగించారు. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ రావడం ఇండియా బలాన్ని పెంచేదే. బ్యాటింగ్‌లో జైస్వాల్ , జురెల్ , గిల్ విండీస్‌పైనా రాణించారు. ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్‌లో జైస్వాల్ తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్‌రౌండర్లు జడేజా, నితీశ్ కుమార్ రెడ్డిపైనా భారీ అంచనాలున్నాయి. అటు పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ సఫా రీ బ్యాటర్లను ఇబ్బం ది పెట్టడం ఖాయం. ఎప్పటిలానే భారత్ పిచ్‌లపై కుల్దీ ప్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ తమ మ్యాజిక్ చూపిస్తే సఫారీలకు చెక్ పెట్టొచ్చు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం డబ్ల్యూటీసీ చాంపియన్స్‌గా ఉన్న సౌతాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే పాక్‌తో తొలి టెస్టులో ఓడినప్పటకీ రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేశారు. టెంబా బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు యువ, సీనియర్ ప్లేయ ర్స్‌తో పటిష్టంగానే ఉంది. మార్క్‌క్ర మ్, బ్రెవిస్ లాంటి బ్యాటర్లు, ముత్తుస్వామి, బోస్చ్, ముల్దర్ లాంటి ఆల్‌రౌండర్లతో పాటు రబాడ, కేశవ్ మహరాజ్, మార్కో జెన్సన్ లాంటి బౌలర్లు కూడా సఫారీలకు బలమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని అంచనా వేస్తున్నారు.

టాస్‌కు ప్రత్యేక నాణెం

తొలి టెస్టుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ టాస్ కోసం ప్రత్యేక కాయిన్ తయారు చేయించింది. ఈ గోల్డ్ కాయిన్‌లో ఒకవైపు మహా త్మా గాంధీ, మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మనండేలా చిత్రాలు ముద్రించారు.ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకూ టాస్ కోసం ఇదే కాయిన్‌ను ఉపయోగించనున్నారు. 2015 నుంచి భారత్, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌ను ఫ్రీడమ్ ట్రోఫీగా పిలుస్తున్నారు.