20-06-2025 11:33:15 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): జీఎంఆర్ రగ్బీ ప్రీమియర్ లీగ్(GMR Rugby Premier League) తొలి సీజన్లో హైదరాబాద్ హీరోస్(Hyderabad Heroes) మరో సంచలన విజయంతో హ్యాట్రిక్ సాధించిందని ఆర్పీఎల్ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో హీరోస్ 43-12 స్కోరు తేడాతో కళింగ బ్లాక్ టైగర్స్ ను చిత్తు చేసిందన్నారు. వరుసగా మూడో విజయంతో హీరోస్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ హీరోస్ ఏడు ట్రైలను సాధించిందన్నారు. జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు ట్రైలు చేసి తమ సత్తా చాటారని తెలిపారు. జోజి నాసోవా రెండు ట్రైలతో అద్భుత ప్రదర్శన కనబరచగా, టెరియో తమాని నాలుగు ట్రైలను కన్వర్ట్ చేసి జట్టుకు అదనంగా 8 పాయింట్లను అందించాడని తెలిపారు.