25 August, 2026 | 1:02 AM

చదువు, ఆటలతో పాటు దొంగతనాల్లో మేటి!?

25-08-2026 12:08 AM

విద్యావంతుడైన దొంగ అరెస్టు

వరంగల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఎంటెక్ పట్టభద్రుడు, ఫుట్బాల్ ఆటలో జాతీయస్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన యువకుడు జల్సాలకు బానిసగా మారి దొంగగా మారిన ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ మిల్స్ కాలనీ, సిసిఎస్ పోలీసలు సంయుక్తంగా సొమవారం అరెస్టు చేసారు. నిందితుడి నుండి సుమారు 12 లక్షల విలువ గల 70.19 గ్రాముల బంగారు అభరణాలు, 527.9గ్రాముల వెండి, 29,875 రూపాయలు నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస దోంగతనాలకు సంబంధించి మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అదేశాల ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు. డీసీపీ ధార కవిత వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. దొంగతనాలపై పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రత్యేక దృష్టి సారించి నేర విచారణ చేపట్టి,గత కాలంగా జరిగిన చోరీలను విశ్లేషణ చేయగా ఒక అనుమానిత వ్యక్తిని అదుపులో తీసుకోని విచారించగా మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబందించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల, నివాసం పెద్దపల్లి, తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుతం మహరాష్ట్ర లోని చంద్రపూర్లో నివాసం వుంటున్న నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాని తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడినట్లుగా ప్రాధమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు పగటి సమాయల్లో తాళం వేసివున్న ఇండ్లను గుర్తించి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు 2024, 2025 మహారాష్ట్రలో మొత్తం నాలుగు చోరీలకు పాల్పడటంతో నిందితుడిని మహరాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి జైలు తరలించగా, బెయ్పి జైలు విడుదలయినాడు.

నిందితుడు జైలు నుండి విడుదల ఆయిన అతనిలో ఎలాంటి మార్పురాకపోవడం మరో మారు నిందితుడు ఈ సంవత్సరం మీల్స్ కాలనీ పరిధిలోని శివనగర్, ఎస్.ఆర్.ఆర్ నగర్ ప్రాంతంలో తాళం వేసి వున్న ఇండ్లల్లో వరుస చోరీలకు పాల్పడినట్లుగా నిందితుడు విచారణలో వెల్లడించాడు. చోరీకి పాల్పడిన అంతర్ రాష్ట్ర నిందితుడి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్ రామకృష్ణ, మీల్స్కాలనీ ఇన్స్ స్పెక్టర్ స్వామి, ఎస్ ఐ మహేష్, ఏ. ఏ.ఓ సల్మాన్ పాషా తో పాటు సిసిఎస్, మీల్స్ కాలనీ సిబ్బందిని వరంగల్ పొలీస్ కమిషనర్ అభినందించారు.