13 July, 2026 | 2:12 AM

హైదరాబాద్‌దే తెలంగాణ టీ20 లీగ్

13-07-2026 01:48 AM

ఫైనల్లో ఖమ్మం ఏసెస్‌పై విజయం

హైదరాబాద్, జూలై 12: తెలంగాణ టీ20 లీగ్ తొలి సీజన్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ విజేతగా నిలిచింది. ఆసక్తికరం గా సాగిన ఫైనల్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఖమ్మం ఏసెస్‌పై విజయం సాధించింది. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా రాణించిన హైదరాబాద్ జట్టు టైటిల్ పోరులోనూ అదరగొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం ఏసెస్‌ను 157 పరుగులకే కట్టడి చేసింది. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఖమ్మం జట్టును హిమతేజ(31), జైస్వాల్(65) ఆదుకున్నారు.

హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3, దేవ్ గౌడ్ 2, మె హతా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనలో హైదరాబాద్ దూకుడుగా ఆడింది. వికాస్ రెడ్డి(4) త్వరగానే ఔటైనా అభిరథ్ రెడ్డి (48), అశ్విన్ (36) రాణించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత వైష్ణవ్ రెడ్డి 41 నాటౌ ట్, ప్రణవ్ వర్మ 19 నాటౌట్ విజయాన్ని పూర్తి చేశారు. హైదరాబాద్ 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. విజేతగా నిలిచిన హై దరాబాద్ జట్టుకు రూ. కోటి, రన్నరప్ ఖ మ్మం ఏసెస్‌కు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. మ్యాచ్ ఆరంభానికి ముందు రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ నైట్, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు అభిమాను లను అలరించాయి.